మీ పాయింట్లు
pts
Explore Mana Mangalagiri App to Earn More
ప్రభుత్వ అధికారం
నుండి ధృవీకరించబడింది December 2024.
Anonymous Post
This post was shared anonymously. The user has chosen to hide their identity.
Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.
పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండకు రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం ఘన సన్మానం
తెలుగుదేశం పార్టీ లో అత్యున్నత పదవి ఐన పొలిటి బ్యూరో సభ్యుడిగా మంగళగిరి కి చెందిన గుత్తికొండ ధనుంజయరావు గారిని ఎంపిక చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జివి నాగేశ్వరరావు గారు హృదయపూర్వకంగా హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా ఈరోజు మంగళగిరిలో ని దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో గల శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయంలో గుత్తికొండ ధనుంజయరావు గారిని కలిసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జీవి నాగేశ్వరావు గారు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంపార్టీ నే నమ్ముకుని పార్టీకి సేవలు అందిస్తూ రాష్ట్రంలోని చేనేత వర్గ నాయకుడిగా దశాబ్దాలపాటు పోరాడిన ధనుంజయ గారిని గుర్తించి తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర చరిత్రలో పద్మశాలీలకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాత్యులు మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ధనుంజయరావు గారితో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శాసనమండలి సభ్యురాలు శ్రీమతి పంచుమర్తి అనురాధ గారికి , కర్నూలు పార్లమెంటరీ మాజీ సభ్యులు డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్ గారికి రాష్ట్ర కార్యదర్శిగా మరియు విశాఖపట్నం చెందిన వానపల్లి గాయత్రి ఫణి కుమారికి కూడా రాష్ట్ర కార్యదర్శిగా పదవులను ఇవ్వటం యావత్ పద్మశాలి సమాజం హర్షం ప్రకటిస్తుంది ఈ సన్మాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వుడతా శ్రీనివాసరావు(బీరువాల శ్రీను), రాష్ట్ర కోశాధికారి తిరువీధుల కిరణ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వానపల్లి త్రిమూర్తులు, కారంపూడి అంకమ్మరావు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు నారాయణ రమాదేవి, సహాయ కార్యదర్శి సంగాబత్తుల గంగాభవాని, గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు జొన్నాదుల బాలకృష్ణ జిల్లా కార్యవర్గ సభ్యులు జొన్నాదుల రామాంజనేయులు, గంటా దుర్గాప్రసాద్, జొన్నాదుల మురళి, జాగు రమణ, గోలి మోహనరావు (పాల చంటి) తదితరులు పాల్గొన్నారు.