Your Points
pts
Explore Mana Mangalagiri App to Earn More
Anonymous Post
This post was shared anonymously. The user has chosen to hide their identity.
Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.
శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన మహోత్సవం
మూడు సంవత్సరాలుగా నిరంతర సేవ… ప్రతి అమావాస్యకు 4000 మందికి అన్నప్రసాదం
భక్తి–సేవల మహాయజ్ఞంగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ అన్నదానం… ప్రతి అమావాస్యకు వేల మందికి అన్నప్రసాదం
ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు
మూడు ఏళ్లుగా నిరంతర సేవ – ప్రతి అమావాస్యకు వేల మందికి అన్నప్రసాదం
శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా నిర్వహించిన అన్నదాన మహోత్సవం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం మంగళగిరి శివాలయం సమీపంలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మెట్ల మార్గం వద్ద జరిగిన ఈ సేవా కార్యక్రమం భక్తి, సేవాభావానికి ప్రతీకగా నిలిచింది.
ప్రతినెల అమావాస్య రోజున నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం గత మూడు సంవత్సరాలుగా ఎలాంటి విరామం లేకుండా కొనసాగుతూ విశేష ఆదరణ పొందుతోంది. ప్రతి సారి సుమారు నాలుగు వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందించడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలుస్తోంది. కార్యక్రమ స్థలానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి, క్రమపద్ధతిలో అన్నప్రసాదం స్వీకరించారు... ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, అన్నప్రసాదం పంపిణీలో పాల్గొని భక్తులకు సేవలందించారు. ఆయనతో పాటు ట్రస్ట్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు మాట్లాడుతూ, పరమశివుని కృపతో పాటు భక్తులు, దాతల సహకారంతో ఈ అన్నదాన యజ్ఞం నిరంతరంగా కొనసాగుతుండటం సంతోషకరమని తెలిపారు. “ప్రతి అమావాస్యకు 4000 వేలా మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించడం మాకు ఆధ్యాత్మిక తృప్తిని ఇస్తోంది. ఆకలితో వచ్చిన వారు సంతృప్తిగా వెళ్లడం కన్నా గొప్ప ఆనందం మాకు లేదు” అని అన్నారు.ఈ సేవా కార్యక్రమం వెనుక సుమారు 40 మంది దాతల సహకారం ఉందని, వారి ఉదార సహాయంతోనే ఇంత పెద్ద స్థాయిలో అన్నదానం నిర్వహించడం సాధ్యమవుతోందని పేర్కొన్నారు. తీవ్ర వేసవి వేడిలో దాహంతో అలమటిస్తున్న వాహనదారులు, పాదాచారులకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్ర ఏర్పాటు చేసినట్లు పందేటి సాంబశివరావు తెలిపారు . ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఆయన ఆధ్వర్యంలో సగర సంక్షేమం కార్యాలయం వద్ద, గౌతమ్ బుద్ధ రోడ్డువెంబడి మజ్జిగ, చల్లని మంచినీటి పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపారు..కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, స్థానిక ప్రజలు ట్రస్ట్ సేవలను అభినందిస్తూ, సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత పెరగాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో కలవకొల్లు వెంకయ్య, గండికోట శ్రీనివాసరావు, కర్నాటి శివ సత్యనారాయణ, నంగళం ప్రసాద్, కగ్గా శ్రీను, దుంపల సోములు, కటారి విష్ణుమూర్తి, కోదాటి శ్రీనివాసరావు, వాసు గోల్డ్, గండికోట అచ్చయ్య, పేరు బోయిన వెంకటేశ్వరరావు, శ్రీహరి, చిరుమామిళ్ల రంగారావు, పంచల శివన్నారాయణ, రెడ్డి వీర రాఘవులు, నంద్యాల గోపాలకృష్ణ, ముద్రబోయిన శ్రీనివాసరావు, అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, బల్ల పార్థసారథి, భోజన పల్లి తాండవ, ఉద్దంటి మురహరి, పుప్పాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.