Your Points
pts
Explore Mana Mangalagiri App to Earn More
Anonymous Post
This post was shared anonymously. The user has chosen to hide their identity.
Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.
గుంటూరులో వేగా జ్యువెలర్స్ ఆభరణాల దుకాణం ఘన ప్రారంభం
ప్రముఖ ఆభరణాల సంస్థ వేగా జ్యుయలర్స్ గుంటూరు నగరంలోని లక్ష్మీపురం ప్రాంతంలో నూతన ఆభరణాల దుకాణాన్ని అక్షయ తృతీయ శుభ సందర్భంగా గురువారం ఘనంగా ప్రారంభించింది. సినీ నటుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై దుకాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు బండ్లమూడి రామ్మోహన్ రావు, నిర్వహణాధికారి నవీన్ వనమా, కార్యనిర్వాహక అధికారి సుధాకర్ వనమా తదితరులు పాల్గొన్నారు. సినీ నటి డింపుల్ హయాతి పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ సందర్భంగా నిర్వహణాధికారి నవీన్ వనమా మాట్లాడుతూ, రాజధాని సమీప ప్రాంతమైన గుంటూరులో దుకాణం ప్రారంభించడం ఆనందదాయకమని తెలిపారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని ఏప్రిల్ 16 నుంచి 26 వరకు సంస్థకు చెందిన అన్ని దుకాణాలలో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు వెల్లడించారు.
వజ్ర ఆభరణాలపై ప్రతి క్యారట్‌కు ప్రారంభ ధర రూ.49,999గా నిర్ణయించినట్లు తెలిపారు. 22 క్యారట్ ప్రమాణం గల బంగారు ఆభరణాలపై తయారీ చార్జీలు 5.99 శాతం నుంచి 12.99 శాతం వరకు మాత్రమే వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాత బంగారు నగల మార్పిడి పై ప్రతి గ్రాముకు రూ.150 అదనంగా ఇస్తున్నట్లు వెల్లడించారు.గుంటూరు దుకాణం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మొదటి వంద మంది కొనుగోలుదారులకు ఉచితంగా బంగారు నాణెం అందజేస్తున్నట్లు తెలిపారు. అదనంగా నిర్వహించే అదృష్ట డ్రాలో ఎంపికైన ఐదుగురు ఖాతాదారులకు రూ.2 లక్షల విలువైన బంగారు లేదా వజ్రాల హారం గెలుచుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక ఆఫర్లు గుంటూరు దుకాణానికే పరిమితమని స్పష్టం చేశారు.అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు శుభప్రదమని, అవసర సమయంలో ఆర్థిక భద్రతగా ఉపయోగపడుతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, బూర్ల రామాంజనేయులు, మరకశిరి ఎమ్మెల్యే రాజు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, అలాగే ఏపీ టీఎస్ మన్నవ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.