మీ పాయింట్లు
pts
Explore Mana Mangalagiri App to Earn More
ప్రభుత్వ అధికారం
నుండి ధృవీకరించబడింది December 2024.
Anonymous Post
This post was shared anonymously. The user has chosen to hide their identity.
Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.
నిడమర్రు దళితవాడలో తీవ్ర నీటి సమస్య!
రాజధాని నిడమర్రు దళితవాడలో మంచినీరు సరఫరా వెంటనే చేయాలని సీపీఎం నేతలు సచివాలయ ఇంజనీరింగ్ అధికారి రోజాకు అర్జీ ఇచ్చారు.
గత మూడు రోజులుగా నీటి మోటార్ పాడైపోవడంతో 500 దళిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన మోటార్‌ను రిపేర్ చేయించి నీరు సరఫరా చేయాలని, మరో బోరు ఏర్పాటు చేసి స్టాండ్‌బై మోటార్ కూడా ఉంచాలని సీపీఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.రవి డిమాండ్ చేశారు.
తక్షణం మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని కోరిన నేతల స్పందనగా అధికారులు వాటర్ ట్యాంకర్లను దళితవాడకు పంపించారు.