మీ పాయింట్లు
pts
Explore Mana Mangalagiri App to Earn More
ప్రభుత్వ అధికారం
నుండి ధృవీకరించబడింది December 2024.
Anonymous Post
This post was shared anonymously. The user has chosen to hide their identity.
Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.
పేదలకు భోజనం టోకెన్లు పంపిణీ...
*********
మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లోని అన్నా క్యాంటీన్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోవాడ దుర్గారావు తన కుమార్తె లక్ష్మి సాయి రోజా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పేదలకు భోజనం టోకెన్ లను ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు హాజరై భోజనం టోకెన్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గోవాడ తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్ వద్ద భోజనం టోకెన్లు కొనుగోలు చేసి పేదలకు పంచడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు దుర్గారావు ను ఆదర్శంగా తీసుకొని తమ ఇంట జరిగే శుభకార్యాల సందర్భంలో పేదలకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లెల మణికంఠ, కట్టెపోగు ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.