Your Points
pts
Explore Mana Mangalagiri App to Earn More
Anonymous Post
This post was shared anonymously. The user has chosen to hide their identity.
Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.
*మంగళగిరిలో*
*ప్రజానాట్యమండలి శిక్షణ శిబిరాన్ని శనివారం నాడు ప్రారంభిస్తున్న ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ కన్వీనర్ డాక్టర్ కె వి ఎస్ సాయి ప్రసాద్*
*శిబిరాన్ని ప్రారంభించి డప్పు కొట్టి పాట పాడి కళాకారులను ఉత్సాహపరిచిన డాక్టర్ సాయి ప్రసాద్*
*జూలై 19 ,20 తేదీలలో మంగళగిరిలోని ప్రజాసంఘాల కార్యాలయంలో జరగనున్న ప్రజానాట్యమండలి కళాకారుల శిక్షణ శిబిరం*
*జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన కళాకారులు*
*కళాకారుల శిక్షణ శిబిర ప్రారంభానికి అధ్యక్షత వహించిన ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షురాలు పద్మ*
*శిక్షణ శిబిరంలో అతిధిగా పాల్గొన్న ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్ అనిల్*
*డాక్టర్ కె వి ఎస్ సాయి ప్రసాద్ కళాకారుల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ,*
👉సమాజంలో ఉన్న రుగ్మతలకి, సమస్యలకి పరిష్కారాలను చూపడానికి ప్రజా కళాకారులు అనేక కొత్త కళారూపాలు సృష్టించి ప్రజలను చైతన్యవంతం చేయడానికి కృషి చేయాలని అన్నారు
మనుషుల మధ్య సామరస్యత భావాన్ని పెంపొందించడానికి కళాకారులు కృషి చేయాలని ,
విద్వేషాలు సృష్టించే వారి ఎత్తుగడలను తిప్పి కొట్టాలని ఆయన అన్నారు
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ప్రజా కళాకారులు గళాలు విప్పాలని ఆయన కోరారు
కళారూపాల ద్వారా ప్రజలు త్వరగా చైతన్యమవుతారని అన్నారు
అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటూ ప్రజా కళారూపాలను ముందుకు తీసుకెళుతున్న
ప్రజా కళాకారులు అందరికీ అభినందనలు తెలిపారు
👉ప్రజానాట్యమండలి
రాష్ట్ర కార్యదర్శి ఎస్ అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్నాయని
స్మార్ట్ మీటర్లు పెట్టి విద్యుత్ బారాలు పెంచి అదానీకి లాభం చేకూర్చే విధంగా పాటుపడుతున్నారని,
కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం ద్వారా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను, చట్టాలను కాలరాస్తున్నారని
దీనిపై కార్మికులను సంఘటితం చేసేందుకు ఈ శిక్షణా శిబిరంలో కళారూపాలు నేర్పుతున్నామని తెలిపారు
రైతులకు వారు పండించిన పంటకు కనీసం మద్దతు ధర లభించాలని,
నల్ల చట్టాలను రద్దు చేయాలని,
కార్మిక, కర్షకులు సంఘటితమై ప్రభుత్వ విధానాలపై పోరాడాలని తెలిపే పాటలు , నృత్య రూపకాలు, లగునాటికలు ఈ శిక్షణా శిబిరంలో నేర్పిస్తున్నామని తెలిపారు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో జూలై నెలాఖరులోపు ప్రజానాట్యమండలి కళాకారులు
శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయని
దేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ స్వాతంత్ర పోరాట చరిత్రకి సంబంధం లేనటువంటి వ్యక్తుల గుట్టు రట్టు చేసేలా కళారూపాలని సృష్టించి ప్రజలను చైతన్య పరుస్తామని అన్నారు
అధిక ధరలకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కుల, మత ద్వేషాలకు వ్యతిరేకంగా మనుషులందరినీ సంఘటిత పరచడానికి ఈ కళారూపాలు దోహదపడతాయని తెలిపారు
👉 సిఐటియు జిల్లా నాయకులు ఎం రవి మాట్లాడుతూ
రాజధాని అమరావతిలో కష్టజీవులకు, కార్మికులకు కర్షకులకు న్యాయం చేయకుండా కార్పొరేట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊడిగం చేసేలా కూటమి ప్రభుత్వ చర్యలు ఉన్నాయని అన్నారు
ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మించాలని గతం నుండి కోరుతున్నామని సామాన్య ప్రజలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో సంతోషంగా జీవించేలా రాజధాని నిర్మాణం చేపట్టాలని ,అందుకోసం రాజధాని ప్రాంత ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఈ కళాకారుల శిక్షణశిబిరం ఉపయోగపడాలని కోరారు
మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు
సమ్మెకు మద్దతుగా ప్రజా కళాకారులు నిలవాలని కోరారు
కళ కళ కోసం కాదు ప్రజల కోసం అన్న గరికపాటి రాజారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న కళాకారులు అందరికీ అభినందనలు తెలిపారు
ప్రజానాట్యమండలి రాష్ట్ర గాయకులు
ఏ జగన్ కళాకారులకు పాటలలో శిక్షణ ఇవ్వగా, కవి పిఎన్ఎం లఘు నాటికలను నేర్పించారు
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి దేవరకొండ శ్రీనివాసరావు ఆర్ వి రాఘవయ్య లూధర్ పాల్ సుమ రాజ్యలక్ష్మి పార్వతి ప్రసాద్ బాలాజీ బుజ్జిబాబు గాలి శ్రీనివాస్ రావు ప్రజాసంఘాల సీనియర్ నాయకులు జేవీ రాఘవులు
ఎస్ చంగయ్య
వీసం జవహర్లాల్ తదితరులు పాల్గొన్నారు
