Your Points
pts
Explore Mana Mangalagiri App to Earn More
Anonymous Post
This post was shared anonymously. The user has chosen to hide their identity.
Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.
*తుదిదశకు చేరిన జాతీయ రహదారి నిర్మాణ పనులు*
*-త్వరలోనే ప్రజల అందుబాటులోకి జాతీయ రహదారి*
*మంగళగిరి
చెన్నై -కలకత్తా జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు... మరి ముఖ్యంగా గుంటూరు విజయవాడ నగరాల మధ్య రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న జాతీయ రహదారి నిర్మాణ పనులు దాదాపూ తుది దశకు చేరుకున్నాయి. కృష్ణాజిల్లా గొల్లపూడి నుంచి గుంటూరు జిల్లా చినకాకాని వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో నూతన జాతీయ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కిమీ మేర ఆరు వరుసల వంతెన నిర్మాణం ఇప్పటికే పూర్తైంది. మంగళగిరి నగరానికి పడమర వైపు జాతీయ రహదారి నిర్మాణం పూర్తి అయితే హైదరాబాద్ కు వెళ్లే వాహనదారులు విజయవాడ నగరానికి వెళ్లకుండానే జాతీయ రహదారి మీదుగా అతి తక్కువ సమయం లో హైదరాబాద్ కు చేరుకోవచ్చు. సాధ్యమైనంత త్వరలోనే జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ పనులను వేగవంతంగా చేస్తున్నారు.
*News By
*ఎన్.నాగరాజు, జర్నలిస్ట్.✍️*
